Namaste NRI

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ వినోదాత్మక చిత్రం : నితిన్‌

నితిన్‌ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌. శ్రీలీల కథానాయిక. వక్కంతం వంశీ దర్శకుడు. ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మాతలు. ఈ నెల 8న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నితిన్‌ విలేకరులతో మాట్లాడుతూ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ పూర్తి వినోదాత్మక చిత్రం. ఇందులో జూనియర్‌ ఆర్టిస్ట్‌ కేరక్టర్‌ పోషించాను. ఈ మూవీ పూర్తిగా ఎంటైర్టెన్‌మెంట్‌ మోడ్‌లో ఉంటుంది. ఈ కథను చెబుతున్న ప్రతిసారీ నవ్వుతూనే ఉన్నాను అంటున్నారు.  ఇందులో కథనంతోపాటు కేరక్టరైజేషన్స్‌ కూడా కొత్తగా ఉంటాయి. వక్కంతం వంశీ ఇప్పటివరకూ రాసిన పాత్రల్లో ఇందులో నాకోసం రాసిన పాత్ర బెస్ట్‌ అని చెప్పొచ్చు. ఈ కథలో తండ్రీకొడుకుల సెంటిమెంట్‌ కొత్తగా ఉంటుంది అని చెప్పారు. డాక్టర్‌ రాజశేఖర్‌ ఈ సినిమాలో ప్రత్యేకపాత్ర పోషించారు. ఆయన వచ్చాకే కథ నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్తుంది.

అసలు ఆయన ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోరేమో అనుకున్నాం. కానీ వంశీ మాత్రం ఆయనే కావాలని పట్టుబట్టారు. శివానీ, శివాత్మిక బతిమాలడంతో కూతుళ్ల మాట కాదనలేక రాజశేఖర్‌ అంగీకరించారు. ఆ విషయంలో వాళ్లిద్దరూ మాకు పెద్ద హెల్పే చేశారు. ఆయన పాత్రే ఈ సినిమాకు హైలైట్‌. ఇందులో సంపత్‌, రావురమేశ్‌ పాత్రలు కూడా కొత్తగా ఉంటాయ్‌ అని చెప్పారు. హేరిస్‌ జైరాజ్‌ సంగీతం ఈ సినిమాకు ప్రధానబలమని, సాంకేతికంగా కూడా ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని నితిన్‌ అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events