Namaste NRI

ఇప్పుడు ఆడియన్స్‌ కూడా అదే థ్రిల్‌.. శరత్‌మరార్‌

అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా శరత్‌ మరార్‌  నిర్మించిన వెబ్‌సిరీస్‌ దూత. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు. ప్రియాభవానీశంకర్‌, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్‌ కీలక పాత్రధారులు. ఈ నెల 1నుంచి ఈ సిరీస్‌ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విజయవంతంగా ప్రసారం అవుతున్నది. ఈ సందర్భంగా శరత్‌మరార్‌ విలేకరులతో మాట్లాడారు. మంచి ప్రొడక్ట్‌ చేశామని తెలుసు. అయితే ఇంత స్పందన ఊహించలేదు. విక్రమ్‌కుమార్‌ కథ చెబుతున్నప్పుడే ఆ ప్రపంచంలో మనల్ని హోల్డ్‌ చేస్తారు. అయితే ఈ కథను ఎనిమిది ఎపిసోడ్స్‌గా ఎలా మలుస్తారనే క్యూరియాసిటీ ఉండేది. కొన్ని నెలల తర్వాత ఎపిసోడ్స్‌ వారీగా చెప్పారు. థ్రిల్‌ ఫీలయ్యాం. ఇప్పుడు ఆడియన్స్‌ కూడా అదే థ్రిల్‌ ఫీలవుతున్నారు.

నాగచైతన్య చేయడానికి ముందుకు రాకపోతే ఈ సిరీస్‌ లేదు. ఆయన కెరీర్‌లోనే బెస్ట్‌ అనిపించేలా ఇందులో నటించారు. ఆ మాటకొస్తే ఇందులోని ప్రతి ఒక్కరూ గొప్పగా నటించారు అన్నారు. తనను పవన్‌కల్యాణ్‌ సినీనిర్మాతను చేశారని, భవిష్యత్‌ అంతా వెబ్‌ చుట్టూనే తిరుగుతుంది కాబట్టే, త్వరగా వెళితే అందులోని గ్రామర్‌ అర్థమవుతుందని వెబ్‌సిరీస్‌ చేయడం మొదలుపెట్టానని, గతంలో ఎన్ని చేసినా, దూత ఇచ్చి విజయం మాత్రం మెమరబుల్‌ అని  ఆనందం వెలిబుచ్చారు. 240 దేశాల్లో ఈ సిరీస్‌ విడుదల చేయడమే కాక, 38 భాషల్లో సబ్‌టైటిల్స్‌ చేశారు. పనిచేసిన ఆర్టిస్టులందరూ ప్రపంచానికి పరిచయం అయ్యారు. ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్స్‌లో కూడా దూతలోని ఒక ఎపిసోడ్‌ ప్రదర్శించాం. ఇలా ఆర్థికంగానేకాక, మానసికంగా కూడా సంతృప్తిన్చింది దూత అని చెప్పారు.  

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events