కువైత్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థుల కు ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ కువైత్ గుడ్‌న్యూస్ చెప్పింది. మనోళ్ల కోసం ఈ వీకెండ్లో హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్-2023 నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫెయిర్ ఈ నెల 8, 9వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు (కువైత్ కాలమానం ప్రకారం) ఉంటుంది. వేదిక వచ్చేసి సాల్మియాలోని ఇండియన్ కమ్యూనిటీ స్కూల్, సీనియర్ బ్రాంచీ. ఇక ఈ ఉన్నత విద్యా మేళా అనేది భారతదేశం, విదేశాలలో ఉన్నత విద్య కోసం అడ్మిషన్లు కోరుకునే తల్లిదండ్రులు, విద్యార్థులకు మంచి అవకాశం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రముఖ బిజినెస్ స్కూల్స్, మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కళాశాలలు, హెల్త్ సైన్సెస్, హ్యూమానిటీస్, మేనేజ్మెంట్ కాలేజ్, అర్కిటెక్చర్ అండ్ డిజైన్ కాలేజ్, లా కాలేజ్, కులినరీ ఆర్ట్స్, హస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఇండియా మరియు విదేశాలలోని టూరిజం మేనేజ్మెంట్ యూనివర్సిటీస్ ఈ ఫెయిర్‌లో పాల్గొంటున్నాయి.