ప్రముఖ నటి, గాయని, రచయిత్రి టేలర్ స్విఫ్ట్ 2023 ఏడాదికి టైమ్ మ్యాగ్‌జైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికయ్యారు. ప్రపంచంలోని ప్రముఖులు పోటీపడినప్పటికీ చివరకు ఆమె విజేతగా నిలిచారు. ఫైనల్‌కు ఎన్నికైన బార్బీ, కింగ్ ఛార్లెస్-3, ఓపెన్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సామ్ ఆల్ట్‌మన్ తదితర తొమ్మిది మంది నుంచి టేలర్ స్విఫ్ట్‌ను విజేతగా ఎంపిక చేసినట్టు టైమ్ ప్రకటించింది. ఆమెపై ఆదరణ దశాబ్దాల నుంచి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నది అంటూ ఆమె ఎన్నిక సందర్భంగా టైమ్ వ్యాఖ్యానించింది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అత్యధికంగా ప్రాతినిధ్యం వహించిన కళాకారిణి అని స్పాటిఫై ప్రకటించిన వారం తర్వాత టైమ్ మ్యాగ్‌జైన్ టేలర్ స్విఫ్ట్‌ను పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రకటించడం విశేషం.