Namaste NRI

హాయ్‌ నాన్న ఆ లోటు తీరుస్తుంది.. నాని

నాని హీరోగా రూపొందిన చిత్రం హాయ్‌ నాన్న. మృణాళ్‌ఠాకూర్‌ కథానాయిక. బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పొషించింది. శౌర్యువ్‌ దర్శకుడు. మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌రెడ్డి తీగల నిర్మాతలు. ఈ గురువారం ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నాని విలేకరులతో ముచ్చటించారు.  హాయ్‌ నాన్న చాలా ఎమోషనల్‌ ఫిల్మ్‌. చూసి ఆనందంగా నవ్వుతూ బయటికొస్తారు. ఆ ఆనందంలోనే మనసుని హత్తుకునే ఎమోషన్‌ హై ఉంటుంది అన్నారు.

 నేను ఏ జానరైనా కంఫర్ట్‌గానే ఫీలవుతా. ఇమేజ్‌ను కూడా పట్టించుకోను. కథ నచ్చితే చేసేస్తా. నేను చేసిన సినిమాలన్నీ ఎంజాయ్‌ చేస్తూ చేసినవే. దర్శకుడు శౌర్యువ్‌ ఈ కథ చెప్పినప్పుడే చాలా హై వచ్చింది. యానిమల్‌ తో సహా ఈ ఏడాది వచ్చిన యాక్షన్‌ సినిమాలు కావాల్సిన దానికంటే ఎక్కువ స్పైసీని పంచాయి. కారం తిన్న తర్వాత కాస్త స్వీట్‌ కూడా టేస్ట్‌ చేయాలి. హాయ్‌ నాన్న ఆ లోటు తీరుస్తుంది. ఈ ఏడాది అందరూ అన్ని ఐటమ్స్‌ పెట్టారు. ముంగించే ఐటెం నేను పెడతా అన్నారు. మృణాళ్‌ ఠాకూర్‌ పోషించిన యష్ణ పాత్ర ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని, బేబీ కియారా ఖన్నా నటన మనసులకు హత్తుకుంటుందని, సాంకేతికంగా సినిమా నెక్ట్స్‌ లెవల్లో ఉంటుందని నాని చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events