తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత. ఆయనతోపా మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. భట్టి విక్రమార్క్ ను ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. కొత్త మంత్రులతో అల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఒక్కొక్కరితో గవర్నర్ తమిళి సై ప్రమాణ స్వీకారం చేయించారు.. ముందుగా భట్టి, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆపై మిగిలిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క, పొగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీదర్ ఉన్నారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుక్విందర్ సుఖు, తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.