Namaste NRI

హైదరాబాద్‌ నగరానికి మరో అరుదైన గుర్తింపు

హైదరాబాద్‌ నగరానికి మరో అరుదైన గుర్తింపు దక్కింది. దేశంలో మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిన నగరాల జాబితాలో హైదరాబాద్‌ నిలిచింది. ఈ మేరకు మెర్సర్స్‌ క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ ర్యాంకింగ్స్‌ 2023లో వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో పుణె, బెంగళూరు, చెన్నై నగరాలు నిలిచాయని పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిన నగరాల జాబితాను క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ రిపోర్ట్‌ పేరిట మెర్సర్స్‌ కంపెనీ విడుదల చేసింది. ఇందులో వియన్నా ( ఆస్ట్రియా) తొలి స్థానంలో నిలిచింది. ఈ నగరానికి ఉన్న ఘనమైన చరిత్ర, అద్భుతమైన కట్టడాలు, సాంస్కృతికత వంటి వివిధ కారణాలతో వియన్నా అత్యంత జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా నిలిచింది. వియన్నా తర్వాత రెండో స్థానంలో జురిచ్‌ (స్విట్జర్లాండ్‌), మూడో స్థానంలో ఆక్లాండ్‌ (న్యూజిలాండ్‌) నిలిచాయి. భారత్‌ విషయానికొస్తే ఈ జాబితాలో హైదరాబాద్‌ ( 153వ స్థానం) అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత పుణె (154) రెండో స్థానం, బెంగళూరు (156) మూడో స్థానం, చెన్నై ( 161) నాలుగో స్థానం, ముంబై (164) ఐదో స్థానం, కోల్‌కతా (170) ఆరో స్థానం, న్యూఢిల్లీ (172) ఏడో స్థానంలో నిలిచాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events