Namaste NRI

ప్రభాస్‌ సలార్ ఫస్ట్‌ సింగిల్‌ అప్‌డేట్‌

ప్రభాస్‌  హీరోగా రూపొందుతున్న చిత్రం సలార్‌. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం.  యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న సలార్‌ రెండు పార్టులుగా రానుందని తెలిసిందే. ఈ మూవీలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. జగపతిబాబు, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్‌, సప్తగిరి, సిమ్రత్‌ కౌర్‌, పృథ్విరాజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సలార్‌లో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్‌ వరదరాజ మన్నార్ ది కింగ్ పాత్రలో నటిస్తున్నారు.  

విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో స్పీడ్‌ పెంచింది ప్రభాస్‌ టీం. ముందుగా ప్రకటించిన ప్రకారం సలార్ ఫస్ట్‌ సింగిల్‌ సూరీడే లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు. సూరీడే గొడుగు పట్టి వచ్చాడే భుజం తట్టి చిమ్మ చీకటిలో నీడలా ఉండెటోడు అంటూ సాగుతున్న ఈ పాట సలార్, వరద రాజ మన్నార్‌ స్నేహం నేపథ్యంలో ఉండబోతున్నట్టు రషెస్‌తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్‌. మొత్తానికి ఈ ఫస్ట్ సాంగ్‌ సినిమాకే హైలెట్‌గా నిలువబోతున్నట్టు చెప్పకనే చెబుతోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసిన సూరీడే లిరికల్ వీడియో సాంగ్‌ను రేపు లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించారు. సలార్‌ను కేరళలో పృథ్విరాజ్‌ సుకుమారన్ హోం బ్యానర్ పృథ్విరాజ్ ప్రొడక్షన్స్‌ హౌజ్‌ విడుదల చేస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events