Namaste NRI

మహేశ్‌బాబుతో శ్రీలీల రొమాన్స్‌.. గుంటూరుకారం నుంచి మరో పాట రిలీజ్‌

మహేశ్‌బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం గుంటూరుకారం. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు.  హారిక-హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తు న్నారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్‌ ఇతర పాత్రధారులు.  ఈ  సినిమా ప్రమోషన్‌ మొదలుపెట్టిన ప్పట్నుంచీ విడుదలవుతున్న ప్రతి అప్‌డేట్‌కీ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. విడుదలైన మొదటి టీజర్‌కీ, తొలి గీతానికీ ప్రేక్షకుల్లో అద్భుతమైన స్పందన కనిపించింది. ఈ సినిమాకు సంబంధించిన రెండో పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఓ మై బేబీ అంటూ సాగిన ఈ గీతాన్ని రామజోగయ్యశాస్త్రి రాయగా, తమన్‌ స్వరపరిచారు. శిల్పారావు ఆలపించారు. మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల మ్యాజిక్‌ కోసం ఎదురు చూసేలా ఈ పాటలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్‌ పరమహంస.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events