అనురాగ్, అవికా గోర్ జంటగా నటిస్తున్న చిత్రం ఉమాపతి. క్రిషి క్రియేషన్స్ పతాకంపై సత్యం ద్వారంపూడి దర్శకత్వంలో కె.కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. అందమైన గ్రామీణ నేపథ్యంలో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. రెండు గ్రామాల మధ్య గొడవలు నాయకానాయికల ప్రేమకు అడ్డుగోడలా నిలిచే సన్నివేశాలతో టీజర్ ఆసక్తికరంగా సాగింది.కుటుంబ సమేతంగా చూడాల్సిన చిత్రమిదని, సహజత్వం ఉట్టిపడే గ్రామీణ ప్రేమకథగా ప్రతి ఒక్కరిని అలరిస్తుందని దర్శకుడు తెలిపారు.
ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, తులసి, ప్రవీణ్ తదితరులు నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు రాఘవేంద్ర కెమెరామెన్‌గా, గౌతమ్ రాజు, నానిలు ఎడిటర్లుగా పని చేశారు. వెంకట్ ఆరే ఆర్ట్ డిపార్ట్మెంట్ను, చంద్రబోస్, మూర్తి దేవగుప్తపు, భాస్కర భట్ల పాటల రచయితలుగా పని చేసిన ఈ మూవీని డిసెంబర్ 29న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.