టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం అమెరికాలో చిల్ అవుతున్నాడు. విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. పరశురామ్ దర్శకత్వం. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొన్నటి వరకు ఢిల్లీలో జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ అమెరికాలోని న్యూ జెర్సీలో జరుపుకుంటోంది. ఇక షూటింగ్ అనంతరం రాత్రి డిన్నర్‌కు ఓ స్టార్ హోటల్‌కు వెళ్లిన విజయ్ అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకు న్నాడు. కాగా, ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతాన్నందిస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)