Namaste NRI

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో… దివ్యాంగులకు  ట్రై సైకిళ్ల పంపిణీ

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని గజ్వేల్‌ పట్టణంలోని మురళీకృష్ణ ఆలయంలో దివ్యాంగులకు ట్రై  సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా అధ్యక్షుడు వంశీరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత పేదలకు సేవ చేయడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని  తెలిపారు. డిసెంబర్‌లో తెలంగాణలోని ఆయా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలలో మూడు వారాలుగా సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల స్కూళ్లలో విద్యార్థులకు బెంచీలు, అత్యవసర సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ములుగు మండలం తునికి బొల్లారం గ్రామానికి చెందిన తాము భవిష్యత్తులో కూడా గజ్వేల్‌ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. 15 మంది దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నవీన్‌ రెడ్డి, సురేష్‌ రెడ్డి, కవిత, దేవేందర్‌ రెడ్డి, రాంచెంద్రం, లక్ష్మయ్య, సంతోష్‌, సంగీత తదితరులున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events