మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గుంటూరు కారం. ఈ మూవీని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) తెరకెక్కిస్తున్నారు. శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వం. మీనాక్షి చౌదరి సెకండ్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, జగపతిబాబు, జయరాం తదితరులు నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. ప్రస్తుతం ఈ సినిమా తుదిదశ చిత్రీకరణలో ఉంది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో నాయకానాయికలపై రొమాంటిక్ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ పాట చిత్రీకరణను పూర్తి చేయబోతున్నారు. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్లేనని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)