Namaste NRI

అరుదైన రికార్డును సృష్టించిన ప్రధాని మోడీ… ప్రపంచంలోనే అగ్రస్థానం

ప్ర‌ధాని మోదీ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఆయ‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో స‌బ్‌స్క్రైబ‌ర్ల సంఖ్య‌ రెండు కోట్లు దాటింది.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న దేశాధినేత‌లు అత్య‌ధిక సంఖ్య‌లో మోదీకి యూట్యూబ్ ఖాతాదారులు గా ఉన్నారు. ప్ర‌భుత్వ యూట్యూబ్ ఛాన‌ల్‌లో ప్ర‌ధాని త‌న వీడియోల‌ను పోస్టు చేస్తుంటారు. ఆ వీడియోల‌ను సుమారు 450 కోట్ల మంది ఇప్ప‌టికే వీక్షించారు. ప్ర‌పంచ నేత‌ల్లో ఎవ‌రు కూడా ఆయ‌న ద‌రిదాపుల్లోలేరు. బ్రెజిల్ మాజీ అధ్య‌క్షుడు జెయిర్ బొల్స‌నారో స‌బ్‌స్క్రైబ‌ర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఆయ‌న‌కు 64 లక్ష‌ల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు.

ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెల‌న్‌స్కీ రెండో స్థానంలో ఉన్నారు. ఆయ‌న వీడియోల‌కు 22.4 ల‌క్ష‌ల వ్యూవ్స్ ఉన్నాయి. అమెరికా అధ్య‌క్షుడు బైడెన్‌కు 7.89 ల‌క్ష‌ల స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. ట‌ర్కీ అధ్య‌క్షుడు రిసెప్ త‌యిప్ ఎర్డగోన్‌కు 3.16 ల‌క్ష‌ల స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. యోగా విత్ మోదీ అన్న యూట్యూబ్ ఛాన‌ల్‌లో కూడా మోదీకి ఫుల్ క్రేజీ ఉంది. ఆ ఛాన‌ల్‌లో ఆయ‌న‌కు 73 వేల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events