Namaste NRI

దుబాయ్ లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ సంబరాలు

యూఏఈ   దుబాయ్ లో ఉన్న క్రైస్తవ సంఘాల కలయికతో బ్రదర్ సామ్యూల్ రత్నం నీలా గారి ఆద్వర్యంలో ఘనంగా డేరా క్రీక్  Dhow Cruise నందు అంగరంగ వైభవంగా క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు.  ఈ సందర్భంగా క్రైస్తవులు మరియు ఇతర మతస్థులు అందరూ  రెండు వందల కుటుంబాలు,వారి పిల్లలతో కలిసి వేడుకలను జరుపుకున్నారు . ఇందులో భాగంగా క్రైస్తవ సంఘాల క్వయర్ తో కలిసి అందరూ పాటలతో , ప్రార్థనలతో అలరించారు . బ్రదర్ అరవింద్ వుడ్స్-సాక్సోఫోన్, యేసు,మేరి జ్యోతి బృందం వారు క్రిస్మస్ కేరల్స్ తో గాత్ర కచేరితో అలరించారు. ఈ కార్యక్రమంలో దుబాయ్ లో వివిధ సంఘాల పాస్టర్స్ మరియు  సంఘ పెద్దలలో పాటు సామాజిక కార్యకర్తలు బ్రదర్.శ్రీకాంత్ చిత్తరవు, పాస్టర్.జాన్ ప్రసాద్, పాస్టర్.జైకుమార్ రబ్బి, ఇమ్మాన్యేల్ నీలా,జూలియాన హుర్గోయి, పాస్టర్.సంపదరావు, పాస్టర్.రత్నరాజు, పాస్టర్.సాల్మన్ రాజు, జోయల్ మీడియా టీమ్ ,బ్రదర్.సతీష్ ఏలేటి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events