Namaste NRI

ప్రేక్షకులు ఇందులో ఓ కొత్త రవితేజని చూస్తారు 

రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ధమాకా చిత్రం విడుదలై ఏడాది పూర్తయింది. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. అలాగే తన పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రవితేజ హీరోగా ఆయన నిర్మించిన ఈగల్‌ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రెండు చిత్రాల సెలబ్రేషన్స్‌ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవితేజ మాట్లాడుతూ విశ్వప్రసాద్‌ గారికి అభినందనలు. ఆయన నిర్మించిన ధమాకా చిత్రం విడుదలై అప్పుడే ఏడాది అయిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. శ్రీలీల పెద్ద హీరోయిన్‌ అవుతుందని చెప్పాను. అది నిజమైంది. అలాగే సంగీత దర్శకుడు భీమ్స్‌కు కూడా మంచి గుర్తింపు వస్తుందని ధమాకా విడుదలకు ముందే బలంగా నమ్మాను. ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండడం ఆనందంగా ఉంది అన్నారు.

ఆ తర్వాత ఈగల్‌ సినిమా గురించి మాట్లాడుతూ కార్తీక్‌ను ఛాయాగ్రాహకుడిగా చూశాం. ఈ సినిమాతో దర్శకుడిగా చూస్తాం. ఇందులో కొత్త రవితేజ కనిపిస్తాడు. అలాగే హీరోయిన్‌ కావ్యా థాపర్‌ కూడా. దేవ్‌ జాంద్‌ చాలా మంచి సంగీతం ఇచ్చాడు. తను గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా. విశ్వప్రసాద్‌గారితో ప్రయాణం కొనసాగుతుంది అన్నారు.  ఈ కార్యక్రమంలో దర్శకుడు కార్తిక్‌ ఘట్టమనేని, నిర్మాతలు విశ్వప్రసాద్‌, వివేక్‌,  విశ్వప్రసాద్‌, శ్రీలీల, కావ్యా థాపర్‌ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events