కిషోర్ కేఎస్‌డీ, దియా సితెపల్లి జంటగా నటిస్తున్న చిత్రం ప్రేమకథ. శివశక్తి రెడ్డి దర్శకత్వం. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఈ సినిమా ఫస్ట్‌లుక్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. వైవిధ్యభరితమైన ప్రేమకథా చిత్రమిది. మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో సాగుతుంది. నేటి యువతరాన్ని ఆకట్టుకునే అన్ని అంశాలుంటాయి. కథానుగుణంగా చక్కటి పాటలు కుదిరాయి అన్నారు. రాజ్ తిరందాసు, వినయ్ మహదేవ్, నేత్రసాధు తదితరులు నటిస్తున్నారు. జనవరి 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: వాసు పెండెం, సంగీతం: రధన్, నిర్మాతలు: విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్, రచన-దర్శకత్వం: శివశక్తి రెడ్డి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)