ఉక్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్లతో రష్యా విరుచుకుపడింది. ఒక్కరోజే 122 క్షిపణులను, 36 డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. 2022 ఫిబ్రవరి నుంచి జరుగుతున్న యుద్ధంలో ఇదే అతి పెద్ద గగనతల దాడి అని చెప్పారు. ఈ దాడిలో 87 క్షిపణులను, 27 డ్రోన్లను అడ్డుకున్నామని పేర్కొన్నారు. రష్యా విరుచుకుపడటంతో ఉక్రెయిన్ మిత్ర దేశాలను ఆశ్రయించింది.