వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్. శైలేష్ కొలను దర్శకుడు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధాశ్రీనాథ్, రుహానీ శర్మ తదితరులు నటిస్తున్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రధానంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి బుజ్జి కొండవే అనే ఎమోషనల్ సాంగ్‌ను విడుదల చేశారు. కూతురు అనారోగ్యం వల్ల తండ్రి కలత చెందడం, తన గుండెల్లోని బాధను దిగమింగుతూ చిన్నారికి సాంత్వన చేకూర్చే ప్రయత్నంలో ఈ పాట సాగింది.
బంగారమే నువ్వు నా వరమే నీ సంతోషమే నన్ను నడిపించే బలమే అంటూ పాట భావోద్వేగభరితంగా సాగింది. సంతోష్ నారాయణన్ స్వరాల్ని సమకూర్చగా, ఎస్పీ చరణ్ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి గీత రచన చేశారు. ఈ చిత్రాన్ని జనవరి 13న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: యస్.మణికందన్, సంగీతం: సంతోష్ నారాయణన్, రచన-దర్శకత్వం: శైలేష్ కొలను.