హెచ్-1బీ వీసా అప్లికేషన్ ప్రీమియం ప్రాసెసింగ్ రుసుమును 12 శాతం పెంచుతూ యూఎస్ సిటిజెన్‌షిప్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. ఐ-129, ఐ-140, ఐ-539, ఐ-765 ఫామ్స్‌కు ఇది వర్తిస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26 నుంచి అమల్లోకి వస్తుంది. హెచ్-1బీ అప్లికేషన్ల ఈ-రిజిస్ట్రేషన్లు మార్చిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తాజా రుసుము పెంపుతో నాన్-ఇమ్మిగ్రెంట్ వర్కర్ కోసం ఉద్దేశించే ఫాం ఐ-129 ఫాం ప్రాసెసింగ్ రుసుము 2,805 డాలర్లకు పెరగ్గా, అంతర్జాతీయ విద్యార్థులకు నిర్దేశించిన ఫాం ఐ-539 రుసుము 1,750 డాలర్ల నుంచి 1,965 డాలర్లకు పెరిగింది. ఉద్యోగార్థుల కోసం ఉద్దేశించిన ఫాం ఐ-765 ప్రాసెసింగ్ ఫీజు 1,685 డాలర్లకు పెరిగింది.