జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న తాజా చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం. శ్రీదేవి గారలపట్టి జాన్వీకపూర్ దేవర తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిభాగం 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి తారక్ లుక్‌తో పాటు, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ లుక్‌లను రిలీజ్ చేయగా, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే కొత్త సంవత్సరం కానుకగా నందమూరి అభిమానుల కు సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కొత్త సంవత్సరం కానుకగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్లో ఎన్టీఆర్ సముద్రం మధ్యలో మాస్ లుక్‌లో కనిపిస్తు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు. మరోవైపు దేవర గ్లింప్స్‌ను జనవరి 08న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.