వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్. శైలేష్ కొలను దర్శకత్వం. వెంకట్ బోయనపల్లి నిర్మాత. సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీకి ఇంకా 12 రోజులే ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగం పెంచింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌తో పాటు పాటలకు ఆడియోన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ అప్‌డేట్ ఇచ్చారు. న్యూ ఇయర్ కానుకగా సైంధవ్ ట్రైలర్‌ను జనవరి 03న విడుదల చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ అందించారు. 2 గంటల 15 నిమిషాల రన్‌టైమ్ తో ఈ సినిమా వస్తోంది. ఈ పాన్ ఇండియా మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయన పల్లి భారీ స్థాయిలో నిర్మిస్తుండగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రమిది కావడం విశేషం.