జపాన్‌లో భూకంపం, సునామీ హెచ్చరికల నేపథ్యంలో అక్కడి భారతీయ ఎంబసీ అప్రమత్తమైంది. అత్యవసర సందర్భాల్లో సంప్రదించేందుకు వీలుగా హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు హెల్ప్ లైన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలతో ఓ ప్రకటన విడుదల చేసింది. అవసరం పడినప్పుడు ఆయా నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొంది.ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్లు ఇవే..+81-80-3930-1715 (యాకుబ్ టోప్నో), +81-70-1492-0049 (అజయ్ శేఠీ), +81-80-3214-4734 (డీఎన్ బార్న్‌వల్), +81-80-6229-5382 (ఎస్. భట్టాచార్య), +81-80-3214-4722 (వివేక్ రాఠీ).
సోమవారం మధ్య జపాన్‌లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుగాపై 7.6గా నమోదు కావడంతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. పశ్చిమ తీరంలో మీటర్ ఎత్తున్న అలలు ఎగసిపడ్డాయి. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇషికావా, నిగాటా, టొయోమా ప్రాంతాలకు జపాన్ మెటిమొరొలాజికల్ ఎజెన్సీ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.