ప్రతినిధి-2 ద్వారా సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్నారు నారా రోహిత్. తాజాగా ఆయన నటిస్తున్న 20వ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి గౌతమ్‌రెడ్డి క్లాప్‌నిచ్చారు. వెంకటేష్ నిమ్మల పూడి దర్శకత్వంలో సందీప్ పిక్చర్ ప్యాలెస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. విర్తి వాఘని, శ్రీదేవి విజయ్ కుమార్, నరేష్ విజయకృష్ణ, వాసుకి ఆనంద్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. నారా రోహిత్ పాత్ర కొత్త పంథాలో ఉంటుంది అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ప్రదీప్ ఎం వర్మ, సంగీతం: లియోన్ జేమ్స్, ఆర్ట్: రాజేష్ పెంటకోట, రచన-దర్శకత్వం: వెంకటేష్ నిమ్మలపూడి.