ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్‌లను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలను విన్న కోర్టు తీర్పును వచ్చే నెల 15కి వాయిదా వేసింది.
వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ జూన్ 4న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్‌పై బయట ఉన్న జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న రఘురామకృష్ణంరాజు వాదనలను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడిరది. అయితే సీబీఐ వాదనలను కూడా విన్న కోర్టు ఈ విచారణను వాయిదా వేసింది. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ వివిధ కారణాలు చెబుతూ, కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని కోరుట దృష్టికి తీసుకొచ్చారు. ఇక దీనిపై తీర్పు వచ్చే నెల 15న అయినా వస్తుందో రాదో వేచి చూడాలి.