అమ్మాయిలైనా, అబ్బాయిలైనా మీ అనుమతి లేకుండా ఫొటోలను, వీడియోలను మార్ఫింగ్ చేసి ఎక్కడైనా అశ్లీలంగా ఉపయోగిస్తే అది తప్పు. అయితే, మీకు అండగా ఓ రక్షణ వ్యవస్థ ఉందని మర్చిపోవద్దు. వారికి ఫిర్యాదు చేస్తే వెంటనే చర్య తీసుకోబడుతుందని నేను చెప్పగలను అంటూ సినీ నటి రష్మిక మందన్నా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యులను అరెస్టు చేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదలు. నాకు మద్దతుగా నిలిచి, ప్రేమను పంచిన, రక్షించిన సమాజానికి కృతజ్ఞతలు అంటూ డీసీపీ ఐఎఫ్‌ఎస్‌ఓకు ట్యాగ్ చేశారు. తన డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించి ఇన్నాండ్ల తర్వాత రష్మిక ట్విటర్ (ఎక్స్) వేదికగా పోస్టు చేయడంతో ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వీడియోలు, పోస్టులు, మీమ్స్ రూపంలో ఆమెకు అండగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చారు . కాగా, రష్మిక ట్వీట్‌కు లక్షల్లో వ్యూస్ రాగా, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి.
ఇందుకు ఢిల్లీ పోలీసులు స్పందించిస్తూ ఈ కేసును త్వరగా పరిష్కరించినందుకు సంతోషిస్తున్నాం. ఇలాంటి నేరాలకు వ్యతిరేకంగా గళం విప్పడానికి మహిళలను ప్రోత్సహించేలా మా చర్య ఉందని భావిస్తు న్నాం. ఎప్పటికీ శాంతి, సేవ, న్యాయం అనే మా నినాదానికి మేము కట్టుబడి ఉన్నాం’ అంటూ రీ పోస్టు చేశారు.