అమెరికా పాఠశాలల్లో హిందీని ప్రపంచ భాషగా ప్రవేశపెట్టడంపై కాలిఫోర్నియాలోని భారతీయ అమెరికన్ల ఆకాంక్ష ఎట్టకేలకు నెరవేరింది. సిలికాన్ వ్యాలీలో రెండు ప్రభుత్వ పాఠశాల పాఠ్య ప్రణాళికలో హిందీని ప్రపంచ భాషగా చేర్చారు. అక్కడి హోర్నర్ మిడిల్ స్కూల్, ఇర్వింగ్టన్ హైస్కూల్‌లో 2024-25 విద్యా సంవత్సరం నుంచి పాఠ్యప్రణాళికలో ప్రయోగాత్మకంగా హిందీని ప్రవేశపెట్టాలని అక్కడి బోర్డు ఈ నెల 17న నిర్ణయించింది. కాలిఫోర్నియా రాష్ట్ర విద్యా సంస్థల్లో హిందీ భాషను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఈ నిర్ణయాన్ని అక్కడి భారతీయ అమెరికన్లు స్వాగతించారు. వీరు తమ పిల్లల కోసం పాఠశాలల్లో హిందీని ప్రవేశపెట్టాలని చాలాకాలంగా కోరుతున్నారు. కాలిఫోర్నియాలో భారతీయ అమెరికన్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫ్రెమాంట్ నగరం ఒకటి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)