తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం హనుమాన్. అమృతా అయ్యర్ కథానాయిక. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం 8 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.150 కోట్ల మార్కును కూడా అందుకుంది. ఇదిలా వుంటే ఈ సినిమాకు అమ్ముడుపోయే ప్రతి టికెట్‌లో 5 రూపాయలను అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇస్తామని చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన ఆదాయంలో రూ.14.25 లక్షలను విరాళంగా అందించింది.తాజాగా 9 రోజులకు గాను ఇప్పటి వరకూ 53,28,211 హనుమాన్ టికెట్లు అమ్ముడు అయ్యాయి. అయితే ఈ టికెట్ల ద్వారా వచ్చిన మొత్తం రూ.2,66,41,055 లను రామమందిరానికి విరాళంగా ఇస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీనికి హనుమాన్ ఫర్ శ్రీరామ్ అని పేర్కొంటూ క్యాప్షన్ ఇచ్చింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)