ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పోటీగా మాజీ దేశ మొదటి మహిళ మిషెల్ ఒబామా బరిలోకి దిగనున్నారు. వచ్చే ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా మిషెల్ ఒబామా నిలిచే అవకాశం ఉన్నదని ఇటీవల ట్రంప్ సలహాదారు రోజర్ జె.స్టోన్ పేర్కొన్నారు. తన అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని, తమ సహకారం కావాలని మిషెల్ ఒబామా 2020లో ప్రముఖ సీఈవోలను కోరినట్టు ఆడమ్స్ తన వ్యాసంలో వెల్లడించారు. బైడెన్ తప్పుకునేలా పరోక్షంగా ఆమె ఇలా ఒత్తిడి తెచ్చినట్టు పేర్కొన్నారు. రాజకీయ వ్యాఖ్యాత మెగిన్ కెల్లె కూడా మిషెల్ రాజకీయ రంగ ప్రవేశం జరగొచ్చని చెప్పా రు.