ఇనయ సుల్తానా, సుదర్శన్‌రెడ్డి, రంగస్థలం మహేశ్, తాగుబోతు రమేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం నటరత్నాలు. చందనా ప్రొడక్షన్స్ సమర్పణలో ఎవరెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించిన ఈ క్రైం కామెడీ థ్రిల్లర్‌కు శివనాగు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు దామోదర్‌ప్రసాద్, కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, దర్శకులు కేఎస్ రవి కుమార్ చౌదరి, సముద్ర డీఎన్‌రావు, రామసత్యానారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శంకర్ మహదేవన్, నిర్మాతలు: చంటి యలమాటి, డాక్టర్ దివ్య, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: నర్రా శివనాగు.