యూఎస్ ఓపెన్ కు టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ దూరమవుతున్నట్లు ప్రకటించింది. మోకాలి గాయం వల్ల ఈ ఏడాది యూఎస్ ఓపెన్‌కు అందుబాటులో ఉండనని వీనస్ తెలిపింది. చెల్లి బాటలోనే అక్క కూడా ప్రయాణించింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ తన ఫేవరెట్ అని, ఈ టోర్నమెంట్లో ఆడకపోవడం తనకు ఎంతో నిరాశ కలిగించదని ఆమె పేర్కొన్నారు.
యూఎస్ ఓపెన్‌లో తనకు కొన్ని మరిచిపోలేని మధుర జ్ఞాపకాలు ఉన్నాయని ఆమె గుర్తు చేసుకుంది. మళ్లీ రాకెట్ పట్టుకుని, టెన్నిస్ కోర్టులో కనిపించడానికి కఠోరంగా శ్రమిస్తానని, వీలైనంత త్వరగా అభిమానుల ముందుకు వస్తానని చెప్పారు. ఏడుసార్లు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న వీనస్ విలియమ్స్ కేవలం ఈ ఏడాది 12 మ్యాచ్‌లే ఆడిరది. కాగా వైల్డ్ కార్డ్‌తో వీనస్ విలియమ్స్ యూఎస్ ఓపెన్ 2021లో ఎంట్రీ ఇచ్చారు.