కృష్ణవంశీ హీరోగా నటించిన చిత్రం అలనాటి రామచంద్రుడు. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకుడు. హైనినా క్రియేషన్స్ పతాకంపై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఆవిష్కరించారు. మా అమ్మ ఎప్పుడు చెప్పేది, మనల్ని ఎవరైనా ప్రేమిస్తే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని కారణాలు అడ్డు వచ్చినా ఆ ప్రేమని చనిపోయేంత వరకు వదులుకోకూడదు అనే డైలాగ్‌తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఆ రాముడు సీత కోసం ఒక్కసారే యుద్ధం చేశాడు. నా సీత కోసం ప్రతిక్షణం నాతో నేనే యుద్ధం చేస్తున్నా అనే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. టీజర్ చాలా బాగుందని, సంభాష ణలు హృదయాల్ని కదిలించేలా ఉన్నాయని దిల్ రాజు ప్రశంసించారు. నిజాయితీ కలిగిన ప్రేమికుడి కథ ఇదని దర్శకుడు తెలిపారు. తమ సంస్థకిది తొలి చిత్రమని, ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా ఆకట్టుకుంటుందని నిర్మాత పేర్కొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)