గీతానంద్, నేహా సోలంకి నటించిన చిత్రం గేమ్ ఆన్. రవి కస్తూరి నిర్మాత. దయానంద్ దర్శకత్వం. ఈ సందర్భంగా నిర్మాత రవి కస్తూరి పాత్రికేయులతో ముచ్చటిస్తూ ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. రియల్ టైం కాన్సెప్ట్‌తో కమర్షియల్ హంగులను జోడించి తెరకెక్కించాం. యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. జీవితాన్ని చాలించాలనుకునే వ్యక్తి అనుకోకుండా ఓ గేమ్‌లోకి ఇన్వాల్వ్ అయితే అతను ఎలాంటి పరిణా మాల్ని ఎదుర్కొన్నాడనేది ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని వినూత్నమైన కాన్సెప్ట్ ఇది. అందుకే విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. శుభలేఖ సుధాకర్, మధుబాల, ఆదిత్యమీనన్ వంటి సీనియర్ నటులు ఈ కథకు బలంగా నిలిచారు. ఫస్ట్‌కాపీ చూసి థ్రిల్‌గా ఫీలయ్యా. నేను ఆస్ట్రేలియాలో వ్యాపారాలు చేస్తాను. అటు బిజినెస్ ఇటు సినిమాను బ్యాలెన్స్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమా అనుభవం మరో పది సినిమాలు చేయడానికి ఉపయోగపడుతుందని అనుకుం టున్నా. ఇప్పటికే రెండు కథలు విన్నా. త్వరలో ఆ సినిమాల్ని ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకురానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)