డ్రీమ్ ఫార్మర్స్ సంస్థ మరో కొత్త చిత్రాన్ని ఆరంభించింది. ఈటీవీ విన్ సహకారంతో బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనురాగ్ పాలుట్ల దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ముహూర్తపు సన్నివేశానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ తన్మయ్ కెమెరా స్విఛాన్ చేయగా, నిర్మాత రాధ క్లాప్‌నిచ్చారు. సీనియర్ నటుడు నరేష్ విజయ్ కృష్ణ, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రల్ని పోషించనున్నారు. ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం కీలక పాత్రలో కనిపించ నున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: అంకుర్, సంగీతం: హెచ్ ఆర్ విక్రమ్.