స్టార్ హీరో సూర్య నటిస్తున్న కంగువ లోని ఉధిరన్ ఎంత భయంకరంగా ఉంటాడో తెలిసిపోయింది. ఈ సినిమాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై నిర్మిస్తున్నారు. దిశా పఠానీ హీరోయిన్. చారిత్రక నేపథ్యంలో దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా మొత్తం 10 భాషల్లో తెరకెక్కుతున్న కంగు వ త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఉధిరన్ అనే క్యారెక్టర్‌ను బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తున్నారు. బాబీ డియోల్ 55వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా కంగువ చిత్రం నుంచి ఉధిరన్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో బాబీ డియోల్ ఉధిరన్‌గా యూనిక్ మేకోవర్‌లో కనిపిస్తున్నారు. త్వరలో థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి కథ: శివ, ఆదినారాయణ, నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్, దర్శకత్వం: శివ.