భారత్‌లో తమ న్యూస్ వెబ్సైట్లను మూసేస్తున్నట్టు యాహూ ప్రకటించింది. కొత్త విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలు, విదేశీ యాజమాన్యంలోని మీడియా కంపెనీల డిజిటల్ కంటెంట్‌ను నియంత్రిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నది. భారత్‌లో యాహూ న్యూస్, యాహూ క్రికెట్, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్, మేకర్స్ ఇండియా మూతపడనున్నాయి. యాహూ ఈ`మెయిల్ సేవలు ఎప్పటిలాగే కొనసాగుతాయి. యాహూ ఇండియా ఎలాంటి కంటెంట్‌ను ప్రసారం చేయదు. యాహూ అకౌంట్, మెయిల్, సెర్చ్ వంటివి ఎప్పటిలాగే పనిచేస్తాయి. వీటిపై ఎలాంటి ప్రభావం ఉండదు. మీ మద్దతు, రీడర్షిప్కు ధన్యవాదాలు అని యాహూ వెబ్సైట్లో నోటీస్ పెట్టారు. మేం అంత సులువుగా ఈ నిర్ణయం తీసుకోలేదు. భారత్‌లోని నియంత్రణ చట్టాల్లో మార్పులు, విదేశీ యాజమాన్యంలో డిజిటల్ కంటెంట్‌ను ప్రచురించే మీడియా కంపెనీలపై ప్రభావం చూపాయి. భారత్‌లో యాహూ సుదీర్ఘ సంబంధాన్ని కలిగి ఉన్నది అని పేర్కొన్నారు.