సుహాస్, శివాని నాగారం జంటగా నటించిన చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలు సంయుక్తంగా నిర్మించాయి. దుశ్యంత్ కటికినేని దర్శకత్వం. శరణ్య ప్రదీప్, నితిన్ కీ రోల్స్ చేశారు. ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. డైరెక్టర్ దుశ్యంత్ మాట్లాడుతూ ఇలాంటి కథలు ఎవరైనా రాస్తారు. ప్రొడ్యూస్ చేసే ధైర్యం ఉన్నవాళ్లు కావాలి. నిర్మాతలతోపాటు కథను నమ్మిన హీరో సుహాస్‌కు థ్యాంక్స్ అని చెప్పారు. సుహాస్ మాట్లాడుతూ ఈ సినిమాలో హీరోతోపాటు మిగతా క్యారెక్టర్స్‌కు ఇంపార్టెన్స్ ఉంది. అదే ఈ స్క్రిప్ట్‌లో ఉన్న బలం. విడుదలకు ముందే ఈ చిత్రంతో హిట్టు కొడుతున్నామని నమ్మాం. అది నిజమైనందుకు సంతోషంగా ఉంది అన్నారు. అమ్మానాన్న ల తర్వాత తాను రుణపడి ఉండేది డైరెక్టర్ దుశ్యంత్‌కే అని హీరోయిన్ శివాని తెలిపారు. ఇంకా మిగతా యూనిట్ సభ్యులంతా కార్యక్రమంలో మాట్లాడారు.