Namaste NRI

ఫస్ట్‌ టైం ఈగల్‌ కోసమే అలాంటి మేకోవర్‌ చేశా : రవితేజ

రవితేజ కథానాయకుడిగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్‌ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈగల్‌ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు.  రవితేజ మాట్లాడుతూ ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన గెటప్‌లో కనిపిస్తాను.ఈ లుక్‌ తీసుకు రావడానికి మూడు నెలలు పట్టింది. ఫస్ట్‌టైం సరికొత్త మేకోవర్‌తో కనిపించబోతున్నా. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచుతుంది అన్నారు. ఈ సినిమాలో ప్రతీ క్యారెక్టర్‌ బాగుంటుంది. పీపుల్‌ మీడియా నాకు హోమ్‌ ప్రొడక్షన్‌ లాంటిది. ఈ బ్యానర్‌లో ఎన్ని సినిమాలు చేయడానికైనా సిద్ధమే అన్నారు.

దాదాపు 300 మంది టీమ్‌ ఈ సినిమా కోసం పనిచేశారని, ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుందని దర్శకుడు తెలిపారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ రవితేజతో మా సంస్థకిది మూడో సినిమా. ఈ సినిమాలో అద్భుతమైన యాక్షన్‌తో పాటు చక్కటి సందేశం ఉంటుంది అన్నారు. ఈ సినిమాలో తన పాత్రను తీర్చిదిద్దిన విధానం కొత్తగా ఉంటుందని కథానాయిక అనుపమ పరమేశ్వరన్‌ చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events