వెన్నెల కిషోర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం చారి 111. సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్. టీజీ కీర్తికుమార్ దర్శకత్వం. ఈ సినిమాను బర్కత్ స్టూడియెస్ బ్యానర్‌పై అదితి సోని నిర్మిస్తుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి కాన్సెప్ట్ టీజర్‌ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
1992లో ఇండియా – పాకిస్థాన్ కలిసి ఒక జాయింట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇకపై రెండు దేశాల్లో ఎలాంటి అణ్వాయుధాలు గానీ బయోలాజికల్ ఆయుధాలు కానీ తయారు చేయగూడదు అనే సంభాషణతో ట్రైలర్ మొదలవుతుంది. ఈ ట్రైలర్ గమనిస్తే టెర్రరిజంకు చెందిన ఒక సీక్రెట్ గ్రూప్ కోవర్ట్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలనీ చూస్తుంది. ఒకవేళ అది స్టార్ట్ అయితే దేశానికి ప్రమాదం. ఇక ఇది కనిపేట్టే సీక్రెట్ స్పైగా ఏజెంట్‌గా వెన్నెల కిషోర్ కనిపించనున్నారు. ఇక సీనియర్ నటుడు మురళి శర్మ ఈ సినిమాలో స్పై ఏజెన్సీ హెడ్‌గా కనిపించను న్నారు. ట్రైలర్ మొత్తం ఫన్ ఎంటర్‌టైనర్‌గా సాగింది. ఈ సినిమా మార్చి 01న ప్రేక్షకుల ముందుకు రానుంది.