2015లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసుపై డాక్యుమెంటరీ తీస్తున్నట్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్ అనే పేరుతో ఈ డాక్యుమెంటరీ రానుండగా, ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రీసెంట్‌గా విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఫస్ట్ లుక్‌తోనే ఈ డాక్యుమెంటరీకి ఫుల్ పాపులారిటీ రాగా తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ ట్రైలర్ గమనిస్తే 2015లో షీనాబోరా హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కన్నతల్లే కూతుర్ని చంపేసిన వైనం అందర్నీ విస్మయానికి గురి చేసింది. 24 ఏళ్ల షీనా బోరాను తల్లి ఇంద్రా ణి ముఖర్జీ, ఆమె అప్పటి డ్రైవర్ శ్యాంవర్ రాయ్, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాలతో కలిసి కారులో గొంతుకోసి చంపారు. ఆ తర్వాత రాయ్‌గఢ్ జిల్లాలోని అడవిలో ఆమె మృతదేహాన్ని కాల్చివేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జీ గత ఆరున్నర సంవత్సరాలుగా జైలులో ఉండి మే 2022 లో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఇంద్రాణి ముఖర్జీ జీవితం ఆధారంగా ఈ డాక్యూమెంటరీ రానున్నట్లు తెలుస్తుంది.