తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు సునీల్ నారంగ్ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో ఛాంబర్ 76వ సర్వసభ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా సునీల్ నారంగ్, ఉపాధ్యక్షులుగా బాలగోవింద్‌రాజ్, వి.ఎల్.శ్రీధర్, ఇన్నారెడ్డి (కో అప్టెడ్), కార్యదర్శిగా కె అనుపమ్‌రెడ్డి, కోశాధికారిగా విజేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా జె.చంద్రశేఖర్‌రావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా బి.లింగంగౌడ్, పి.సుబ్రమణ్యం, డి.విష్ణుమూర్తి, రవీంద్ర గోపాల్, జి.శ్రీనివాస్, బి.సత్యనారాయణగౌడ్, జి.శ్రీనివాస్ రెడ్డి, చెట్ల రమేశ్, బి.విజయ్‌కుమార్, కె.ఉదయ్‌కుమార్ రెడ్డి, ఎం.నరేందర్ రెడ్డి, ఎం.మోహన్ కుమార్, కె.అశోక్‌కుమార్‌లు నియమితులయ్యారు. రెండేళ్ల కాలం పాటు (2021`23) నూతన కమిటీ పనిచేయనున్నది.