Namaste NRI

తండ్రి, కొడుకుల బంధమే లవ్ యువర్ ఫాదర్

శ్రీహర్ష, కషిక కపూర్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లవ్‌ యువర్‌ ఫాదర్‌. మనీషా ఆర్ట్స్‌ అండ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, అన్నపరెడ్డి స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పవన్‌ కేతరాజు దర్శకత్వం.  ఈ సినిమాలో ఎస్పీ చరణ్‌, నవాబ్‌ షా, ప్రవీణ్‌, భద్రం, అంజన్‌ శ్రీవాస్తవ్‌, అమన్‌ వేమ కూడా నటిస్తున్నారు.  ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు. మల్లారెడ్డి కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ విద్యాసంస్థల నిర్వాహకురాలు చామకూర శాలిని కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, సీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ గోపాల్‌రెడ్డి క్లాప్‌ కొట్టారు.

తండ్రీకొడుకుల బంధం, భావోద్వేగాలను ఈ సినిమాలో సరికొత్తగా చూపించనున్నామని నిర్మాత మహేశ్‌ రాఠీ తెలిపారు. ప్రతి ఒక్కరికి తాను నమ్ముకున్న దేవుడి తర్వాతి స్థానం తండ్రిదేనని, తన తండ్రి ఆశీస్సులు ఎప్పు డూ తనతో ఉంటాయని చెప్పారు. కిశోర్‌ రాఠీ గారి జీవితంలోని చిన్న సంఘటనను తీసుకొని దాన్ని డెవలప్‌ చేసుకొని తండ్రీకొడుకుల ఎమోషనల్‌ జర్నీగా ఈ సినిమాను తెరకెక్కించామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రాని కి కెమెరా: మణీంద్ర కుమార్‌, సంగీతం: మణిశర్మ, నిర్మాతలు: కిశోర్‌ రాఠీ, మహేశ్‌ రాఠీ, అన్నపురెడ్డి సామ్రాజ్యలక్ష్మి, దర్శకత్వం: పవన్‌ కేతరాజు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events