Namaste NRI

రక్షిత్‌ అట్లూరి, కోమలి జంటగా శశివదనే

రక్షిత్‌ అట్లూరి, కోమలి జంటగా నటిస్తున్న చిత్రం శశివదనే. సాయి మోహన్‌ ఉబ్బన దర్శకత్వం. అహితేజ బెల్లంకొండ, అభిలాష్‌ రెడ్డి నిర్మించారు. శ్రీమన్‌, దీపక్‌ ప్రిన్స్‌, జబర్దస్త్‌ బాబీ, మహేష్‌ తదితరులు నటిస్తు న్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మనసులో పుట్టే ప్రేమ మచ్చలేనిదైతే ఆ ప్రేమకు మరణం కూడా మనతోనే అంటూ పోస్టర్‌ మీద వేసిన డైలాగ్‌ ఆకట్టుకునేలా ఉంది. గ్రామీణ నేపథ్యంలో నడిచే హృద్యమైన ప్రేమకథా చిత్రమిది. పోస్టర్‌ మీద వేసిన డైలాగ్‌ సినిమా సారాంశాన్ని మొత్తం తెలియజేస్తుంది. మెలోడీ ప్రధానమైన పాటలతో ఆకట్టుకుంటుంది అని చిత్రబృందం పేర్కొంది. ఏప్రిల్‌ 5న ఈ చిత్రాన్ని విడు దల చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్రీసాయికుమార్‌ దారా, సంగీతం: శరవణ వాసుదేవన్‌, రచన-దర్శకత్వం: సాయిమోహన్‌ ఉబ్బన.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events