ఆస్ట్రేలియా లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ముందస్తు వేడుకలను నిర్వహించారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో మెల్బోర్న్‌లో, బ్రిస్బేన్ లో విన్నీ తుముకుంట, సిడ్నీలో రవిశంకర్ దుపాటి, అడిలైడ్ లో రవి యాదవ్, కాన్బెర్ర లో రవి సాయల ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. వినయ్ గౌడ్ సన్నీ ఆధ్వర్యంలో రక్త దానం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలను అభిమా నుల మధ్య కోలాహలంగా నిర్వహించినట్లు తెలిపారు.అరవై ఏళ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసి, తొమ్మిదిన్నర యేండ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్‌కు దక్కిందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాలకు చిరునామాగా నిలిచిన కేసీఆర్ ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని ఆకాంక్షి స్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా నాయకులు ఉదయ్ రెడ్డి, విశ్వామిత్ర మంత్రిపడగ, సునిల్ రెడ్డి , శివ బిళ్ల, సుకుమార్ పాల్గొన్నారు.