పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి తన భార్య సురేఖ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవికి ఏమాత్రం గ్యాప్ దొరికినా సురేఖతో సరదాగా గడిపేస్తుంటాడు. ఇద్దరు కలిసి వెకేషన్స్‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే నేడు సురేఖ పుట్టినరోజు. ఈ సందర్బంగా తన భార్యకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపాడు చిరంజీవి. నా జీవన రేఖ.. నా సౌభాగ్య రేఖ.. నా భాగస్వామి సురేఖ నా జీవితరేఖ నా శక్తికి మూల స్తంభం సురేఖకు జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను అంటూ ఎక్స్ వేదికగా చిరు రాసుకోచ్చాడు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)