Skip to main content

Namaste NRI

ప్రపంచంలో తొలిసారిగా..త్వరలోనే నింగిలోకి

ప్రపంచంలో తొలిసారిగా కలపతో తయారుచేసిన ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా), జపాన్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ ఏజెన్సీ(జాక్సా) ప్రయత్నిస్తున్నాయి. అంతరిక్షయానం కార్యకలాపాలు అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలనే లక్ష్యంతో ఈ ప్రయోగానికి సమాయత్తమవు తున్నాయి.  సుమిటోమో ఫారెస్ట్రీ సహకారంతో క్యోటో విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ఈ ఉపగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఉపగ్రహం శిథిలమై, క్రమంగా భూమిలో కలిసిపోయే స్వభావం కలది కాబట్టి భూమి పర్యావరణాన్ని కాపాడటానికి దోహదపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Social Share Spread Message

Latest News