ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఎయిర్ పోర్టు అయిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారతీయులు మరో రికార్డు సృష్టి్ంచారు. గతేడాది ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులే అత్యధికంగా దుబాయ్ విమానాశ్ర యం మీదుగా రాకపోకలు సాగించారు. మొత్తం 11.9 మంది భారతీయులు రాకపోకలు సాగించినట్టు దుబాయ్ ఎయిర్పోర్టు తాజాగా ప్రకటించింది. అంతేకాకుండా, ప్రయాణికుల సంఖ్యాపరంగా ఎయిర్పోర్టు దాదాపుగా కరోనా పూర్వపు స్థితికి చేరుకుందని వెల్లడించింది. ఎయిర్పోర్టు అధికారులు తెలిపిన వివారల ప్రకారం, గతేడాది మొత్తం 86,994,365 మంది ప్రయాణికులు దుబాయ్ మీదుగా రాకపోకలు సాగించారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 31.7 శాతం అధికం. 2019 నాటి గరిష్ఠంతో పోలిస్తే ఇది ఒకశాతం ఎక్కువ.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)