ఉత్తర కొరియాతో ప్రత్యేక బంధాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి చాటుకున్నారు. రష్యాలో తయారు చేసిన ఆరస్ సెనేట్ లిమోసిన్ కారును ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు బహుమతిగా ఇచ్చారు. కిమ్ వ్యక్తిగత అవసరాల కోసమే దాన్ని ఇచ్చినట్లు ఉత్తర కొరియా ప్రభుత్వం వెల్లడిరచింది. కిమ్ తరపున ఆయన సోదరి కిమ్ యో జోంగ్, వర్కర్క్ పార్టీ ఆఫ్ కొరియా ప్రతినిధి పాక్ జోంగ్ ఛోన్ ఈ బహుమతిని అందుకున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా కిమ్ యో జోంగ్ రష్యాకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇరువురు నేతల మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)