రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతిపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అమెరికా ఒక విఫల దేశమని, రోజురోజుకీ క్షీణిస్తోందని వ్యాఖ్యానించారు. అమెరికాలో తానూ బాధితుడిగా మిగిలిపోయానని పేర్కొన్నారు. నావల్నీ మృతికి, తాను ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలకు ముడి పెట్టారు. అమెరికాలో అసలు ఏం జరుగుతోందని ట్రంప్ ప్రశ్నించారు. అలెక్సీ నావల్నీ ఆకస్మిక మృతి ఘటనతో మన దేశంలో ఏం జరుగు తుందో నాకు అవగాహన కలిగింది. నిజాయతీ లేని అతిపెద్ద లెఫ్ట్ రాజకీయ నాయకులు, ప్రాసిక్యూట ర్లు, న్యాయమూర్తులు నెమ్మదిగా మనల్ని విశానంవైపు తీసుకెళ్తున్నారు. తెరిచిన సరిహద్దులు, ఎన్నికల రిగ్గింగ్, అన్యాయపూరిత కోర్టుల నిర్ణయాలు అమెరికాను నాశనం చేస్తున్నాయి. మనది క్షీణిస్తున్న దేశం, మనది విఫలమైన దేశం అని ట్రంప్ పేర్కొన్నారు.