అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని కేంద్రం మరో నెలరోజుల పాటు పొడిగింది. కరోనా సెకండ్ వేవ్ ఇంకా అదుపులోకి రాకపోగా కొన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని సెప్టెంబరు 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కార్గో సర్వీసులను ఈ నిబంధన వర్తిచందని డీజీసీఏ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అంతర్జాతీయ షెడ్యూల్డ్ కమర్షియల్ పాసింజర్ ఫ్లైట్‌లపై విధించిన నిషేధాన్ని ఆగస్టు 31 నుండి సెప్టెంబరు 30 వరకు పొడిగించింది. అర్హత ఉన్న, అధికారికంగా ఎంపిక చేసిన మార్గాలలో అంతర్జాతీయ షెడ్యూల్ విమానాలను అనుమతించవచ్చునని డీజీసీఏ తెలిపింది.